Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మయసభ సిరీస్లో కృష్ణమ నాయుడు పాత్రలో మెరిసిన ఆది పినిశెట్టి గురించి దర్శకుడు దేవా కట్ట ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే ”ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు. కానీ, ఆది కథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు—తానై సంపాదించుకున్న గుర్తింపు.
ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక వి చిత్రమ్ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ఈరమ్తో గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా తన ముద్ర వేశాడు. “నిన్ను కోరి” లో ఆదిని నేను మొట్ట మొదట గమనించాను. ఆయన డిక్షన్, పాత్రకు తాను తెచ్చిన హుందా తనం నన్ను ఆకట్టుకున్నాయి.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
మయసభ OTT ఫార్మాట్‌కి మారిన వెంటనే, లీడ్ పాత్రలలో నా మనసుకి తట్టిన మొదటి పేరు ఆది—ఏ సందేహం లేకుండా. స్క్రిప్ట్ పంపి, ఎనిమిది గంటల జూమ్ కాల్‌లో మొత్తం కథ నరేట్ చేసాను. రెండు లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి ఆయనను సిద్ధంగా ఉంచాను. చైతన్య రావును ఫైనల్ చేసిన తర్వాత, తాను MSR పాత్రకు సహజంగా ఉంటాడని భావించి, ఆదిని KKN పాత్ర చేయమని రిక్వెస్ట్ చేశాను.
అక్కడ నుంచి ఆదితో పని చేయడం ఒక ఆనందయాత్ర. KKN కారెక్టర్ ఎన్నో పరిమితులు, లేయర్స్ తో నిండిన ఛాలెంజింగ్ రోల్. నత్తి, ఆర్థిక పరిమితులతో పోరాడుతూ, అపరిమితమైన అపరిమైన లక్ష్యాలతో కూడిన పాత్ర. ప్రతి సమస్యని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎదుర్కునే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది KKN పాత్రను ఒక మరాథాన్‌లా తీసుకున్నాడు—ఆ కాలపు రాజకీయ వాతావరణాన్ని గ్రహించి, తన బాడీ లాంగ్వేజ్‌ను దిద్దుకుంటూ, డైలాగ్‌లతోనే కాదు, మాటల మధ్య నిశ్శబ్దంతో కూడా ఎంతో లైఫ్ తీసుకొచ్చాడు.
స్కూల్ పిల్లాడిలా స్క్రిప్ట్ రీడింగ్స్‌లో పాల్గొనడం, నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అపారమైన డెడికేషన్ తో ఒక రియల్ లైఫ్ లెజెండ్‌తో పోల్చుకునే KKN పాత్రను అప్రోచ్ చేశారు. ఆదిలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వు, అమాయకపు కళ్లు, చైతన్య రావుతో తనకు నిజ జీవితంలో ఉన్న స్నేహం ఈ షోకు గొప్ప ఆస్తిగా మారింది. అతను ఇంప్రూవైజ్ చేసిన చిన్న చిన్న హావభావాలు షోలో అనేక అద్భుతమైన మోమెంట్స్‌ను సృష్టించాయి.
ఎన్నో ఉదాహరణలనుంచి ఈ రెండూ పంచుకుంటున్నాను:
1. మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని చాచి పలకరించే ముందు తన రక్తమయమైన చేతిని చూసే దృశ్యం—ఒక శక్తివంతమైన ట్రైలర్ షాట్‌కి మారింది.
2. నామినేషన్ పేపర్లను తీసుకుంటున్నప్పుడు CBRకు బదులివ్వడంలో, అతని స్టైల్లోనే సమాధానం ముగించే విధంగా డైలాగ్ ఎక్స్టెండ్ చెయ్యడం—ఆ హీరోయిక్ మోమెంట్‌ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది.
ఈ సిరీస్‌కి వచ్చిన విమర్శకుల ప్రశంసలు, దేశవ్యాప్త గుర్తింపు ఆయన కెరీర్ ని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకు వెళుతుందని, వెళ్ళాలని ఆశిస్తున్నాను. తను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అంబీషస్ పొలిటికల్ డ్రామాకి ముఖచిత్రం. ఈ దీర్ఘ ప్రయాణం—మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూపులు, సగం మట్టికట్టిన స్క్రిప్ట్‌లను తిరస్కరించిన క్రమశిక్షణ—ప్రతి అడుగు విలువైనదని నిరూపించాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!