NTRNEEL : ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమా డైలాగ్ రైటర్ గా దేవాకట్టా

Devakatta

Devakatta

టాలీవుడ్‌లో పదునైన సంభాషణలు, లోతైన రాజకీయ విశ్లేషణలతో కూడిన కథలు రాయడంలో దర్శకుడు దేవా కట్టా శైలి ప్రత్యేకం. ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ రిపబ్లిక్ వంటి చిత్రాలతో తన రైటింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్‌గా మారారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం దేవా కట్టా రంగంలోకి దిగినట్లు సమాచారం.

దేవా కట్టా రైటింగ్ స్టైల్‌కు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం డైలాగ్స్ రాసే బాధ్యతను దేవా కట్టాకు అప్పగించారు. ఇప్పుడు ఇదే బాటలో మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్‌తో చేస్తున్నచిత్రంలో తెలుగు నెటివిటీ మిస్ కాకుండా ఉండాలని హీరో ఎలివేషన్ సీన్లలో పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం దేవా కట్టాని తీసుకున్నారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ యాక్షన్ మరియు ఎమోషన్స్‌తో నిండి ఉంటాయి. అయితే ఎన్టీఆర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఇక్కడి నేటివిటీని పక్కాగా ప్రతిబింబించేలా డైలాగ్స్ ఉండాలని టీమ్ భావిస్తోంది. దేవా కట్టా రాసే సంభాషణల్లో ఉండే పవర్ ఎన్టీఆర్ నటనకు మరింత బలాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దిగ్గజ దర్శకులు దేవా కట్టాపై భరోసా ఉంచడం ఆయన రైటింగ్ స్టైల్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతుంది.