NTRNEEL : ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమా డైలాగ్ రైటర్ గా దేవాకట్టా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో పదునైన సంభాషణలు, లోతైన రాజకీయ విశ్లేషణలతో కూడిన కథలు రాయడంలో దర్శకుడు దేవా కట్టా శైలి ప్రత్యేకం. ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ రిపబ్లిక్ వంటి చిత్రాలతో తన రైటింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్‌గా మారారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం దేవా కట్టా రంగంలోకి దిగినట్లు సమాచారం.
దేవా కట్టా రైటింగ్ స్టైల్‌కు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం డైలాగ్స్ రాసే బాధ్యతను దేవా కట్టాకు అప్పగించారు. ఇప్పుడు ఇదే బాటలో మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్‌తో చేస్తున్నచిత్రంలో తెలుగు నెటివిటీ మిస్ కాకుండా ఉండాలని హీరో ఎలివేషన్ సీన్లలో పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం దేవా కట్టాని తీసుకున్నారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ యాక్షన్ మరియు ఎమోషన్స్‌తో నిండి ఉంటాయి. అయితే ఎన్టీఆర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఇక్కడి నేటివిటీని పక్కాగా ప్రతిబింబించేలా డైలాగ్స్ ఉండాలని టీమ్ భావిస్తోంది. దేవా కట్టా రాసే సంభాషణల్లో ఉండే పవర్ ఎన్టీఆర్ నటనకు మరింత బలాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దిగ్గజ దర్శకులు దేవా కట్టాపై భరోసా ఉంచడం ఆయన రైటింగ్ స్టైల్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతుంది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?