Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “దీవాన” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ దర్శకుడు శ్రీకాంత్ సినిమాకి హీరో తెలీదు, ఆర్టిస్టులు ఎవరున్నారో తెలీదు, 2022 లో నన్ను పిలిచి రామసింగ్ క్యారెక్టర్ నువ్వు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నన్ను నమ్మి, నాతోనే ఉండి, ఈ సినీ ప్రపంచంలోకి రావడానికి.. ముందు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, సురేందర్ రెడ్డి, వి.వి. వినాయక్ గారు ఆర్టిస్ట్ గా జన్మనిచ్చారు. ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడు 300 సినిమాలు చేసిన తర్వాత, శ్రీకాంత్ నాకు ఒక కొత్త వర్షన్ ని ఇచ్చాడు.
నేను చాలా పెద్దోడిని శ్రీకాంత్ కన్నా, కానీ నా చరిత్ర తనకెట్లా తెలిసింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను చాలా మున్నా క్యారెక్టర్ లా, చాలా చిల్లరగాడిని. చాలా చాలా చాలా చిల్లరగాడిని, అన్ని ఎలిమెంట్లు నాయే కాపీ కొట్టిండు.. కాపీరైట్స్ ఇస్తలేరు. ఒక్కటే తేడా ఉన్నదండి.. ఒకటి లవ్ స్టోరీలో వాడికి ఒక మంచి జరిగింది, నా లవ్ స్టోరీలు అన్నీ ఫెయిల్ అయినాయి. నేను అంత చిల్లరగా, చిల్లరగా తిరుగుతూ పనికిరానోడి లెక్క ఉంటూ.. మంచి ఉద్యోగాలు సంపాదించి బాగుపడిన రోజు కూడా మున్నాకి నేను చెప్పిన డైలాగులు.. తల్లిదండ్రుల గురించి నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇట్టా ఉండిపోయినా. మున్న కథ మంచిగా ఎండ్ అయింది, లవ్ యు మున్నా.. లవ్లీ మూవీ. మీరందరూ డెఫినెట్ గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు, మా శ్రమని మీరందరూ గుర్తిస్తారు అని అన్నారు.
Also Read
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
- King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
తాజావార్తలు
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..