Deepika Padukone : మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోనె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2006లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది దీపిక. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన ఈ అమ్మడు తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో సినిమాలో వివిధ పాత్రలని పోషిస్తు ప్రజంట్, అగ్ర హీరోయిన్‌లో ఒకరుగా కొనసాగుతు వస్తుంది దీపిక. ఇక గత సంవత్సరం ప్రభాస్ తో ‘కల్కి 2898 ఏడి’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇక్కడ కూడా తన సత్తా చాటింది.
Also Read: Vaishnavi : టిల్లు ‘జాక్’ తో హిట్ ఆదుకుంటుందా..!
Also Read
అయితే రీసెంట్‌గా దీపికా ఇనిస్టాగ్రమ్ లో ఒక వీడియోని షేర్ చేసింది. ఇందులో ఆమె ప్రపంచ సినీ మేకర్స్,నటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డు గురించి మాట్లాడుతూ.. ‘చాలాసార్లు మనకి రావాల్సిన ఆస్కార్‌ని లాగేసుకున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి, కానీ వాటికి రావాల్సినంత ప్రత్యేక గుర్తింపు మాత్రం రాలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ కి ఆస్కార్‌ని ప్రకటించగానే అక్కడే ఉన్న నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నాకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒక భారతీయురాలిగా ‘ఆర్ ఆర్ ఆర్’ కి ఆస్కార్ రాగానే ఎంతో ఆనందం వేసింది. ఇక ఈ ఏడాది ‘ది బ్రుటలిస్టు’ చిత్రానికి అడ్రిన్ బ్రాడి ఉత్తమ నటుడుగా నిలిచినందుకు కూడా ఎంతో ఆనందం వేసిందని చెప్పుకొచ్చింది’ ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- Deepika Padukone
- Oscar
- rrr
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!