Site icon NTV Telugu

Deepika Padukone: కల్కి వివాదంపై స్పందించిన దీపిక.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

Deepika

Deepika

Deepika Padukone: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘ కల్కి 2’ ను మేకర్స్ రెడీ చేస్తున్నారు. అయితే, ఈ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పడుకోణెని తొలగించడంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ కొనసాగుతుంది. కేవలం డేట్స్ సమస్యలే కాదు.. భారీగా రెన్యుమరేషన్ పెంచాలని దీపికా డిమాండ్ చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. అంతే కాదు ప్రతి రోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటాను.. తనతో పాటు తన 25 మంది సిబ్బంది కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె అడగటంతోనే వైజయంతీ మూవీస్ కల్కి2898AD సీక్వెల్‌ నుంచి తప్పించినట్లు ప్రకటించింది.

Read Also: Niharika NM: యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌ స్క్రీన్‌ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్‌ స్టోరీ

ఇక, స్పిరిట్, కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తనను తొలగించడంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా స్పందించింది. ‘ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పని చేస్తున్నారు. వీకెండ్ లో అసలు పనే చేయరు అని తేల్చి చెప్పింది. దీని గురించి ఎవరూ మాట్లాడరు.. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఇతర హీరోయిన్లు కూడా 8 గంటలు పని చేయడం స్టార్ట్ చేశారు. కానీ వారు హెడ్ లైన్లలో కనిపించరు.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ఆపేయాలని దీపిక డిమాండ్ చేసింది.

Exit mobile version