కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) లోకి మరో నటి అడుగుపెడుతోంది. తన తొలి సినిమాతోనే అగ్ర కథానాయకుడి సరసన అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నటి దీప్‌శిఖ చంద్రన్. నటుడు కిచ్చా సుదీప్ సరసన ఆమె కన్నడ తెరపై మెరవబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా నటీమణులకు గుర్తింపు రావడానికి కొన్ని సినిమాలు పడుతుంది. కానీ దీప్‌శిఖ తన మొదటి సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన నెటిజన్లు ఇప్పటికే ఆమెను “మార్క్ క్వీన్” అని సంబోధిస్తున్నారు. అరంగేట్రంలోనే ఇలాంటి బిరుదు దక్కడం ఆమె క్రేజ్‌కు నిదర్శనం.
Also Read:Allu Arjun-Lokesh : లోకేశ్‌తో బన్నీసీక్రెట్ మీటింగ్.. మూవీ ఫిక్స్ అవుతుందా?
కిచ్చా సుదీప్ తో చేస్తున్న మార్క్ సినిమా గురించి దీప్‌శిఖ మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకుంది. “కిచ్చా సుదీప్ లాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల నిజమవ్వడమే. ఆయన సెట్స్‌లో చూపించే క్రమశిక్షణ, వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఆయనతో కలిసి పనిచేయడం నా నటనను మెరుగుపరుచుకోవడానికి ఒక గొప్ప పాఠశాలలా ఉపయోగపడింది” అని ఆమె పేర్కొంది. దక్షిణాదిలో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా లాంచ్ అవ్వడం తన అదృష్టమని దీప్‌శిఖ తెలిపింది. ఇంతటి చరిత్ర ఉన్న బ్యానర్‌లో తన ప్రయాణం మొదలవ్వడం కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. “సినిమా రాకముందే ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.” అని దీప్‌శిఖ చంద్రన్ పేర్కొంది.
