ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ఒకటి ఈరోజు ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Sree Leela: ఇది.. ‘కిస్సిక్’ అసలు కథ!
ఈ రోజు అతిరధ మహారధుల సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదు వంశీ , క ఫేమ్ సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపర్ ఆది, రచ్చ రవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్ ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించగా వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ కి సందీప్ డైరెక్షన్ చేశారు.