Site icon NTV Telugu

KJQ: దసరా డైరెక్టర్ తమ్ముడు హీరోగా KJQ.. టీజర్ అదిరిందిగా!

Kjq

Kjq

దసరాలో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోలుగా యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’. నాగార్జున కేడీ డైరెక్టర్ కె.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 1990ల నేపథ్యంలో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తొలి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు ఆసక్తికరంగా సాగుతుంది.

Read More: Anantapur Crime: కొత్తరకం మోసం.. కారులో సీఐ సార్‌ ఉన్నారంటూ..!

‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దీక్షిత్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌లో “ఈ సిటీ, ఈ గన్… రెండూ ఒక్కటే. ఎవరి చేతిలో ఉంటాయో, వాళ్ల మాటే వింటాయి” అనే డైలాగ్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఈ ఒక్క డైలాగ్ సినిమా టోన్‌ని సెట్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. టీజర్‌లో హీరోయిన్ చెప్పిన “మగాడు గెలుస్తాడు, కానోడు లాగేస్తాడు… నీవు ఏమిటో నీవే నిర్ణయించుకో” అనే డైలాగ్ సినిమాలోని ఎమోషనల్ లైన్ ను టచ్ చేస్తోంది. అలాగే, టీజర్ చివర్లో “రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే, రామాయణం ఉండేది కాదు” అనే డైలాగ్ సినిమా కథలోని కీలక ఎమోషన్ ను హైలైట్ చేస్తూ, ప్రేక్షకుల్లో సినిమాను చూడాలనే ఆసక్తిని మరింత పెంచుతుంది.

Read More: Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు, నాగేష్ బనెల్ సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్, శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి. మొత్తంగా, ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’ టీజర్ సినిమాపై భారీ అంచనాలను కలిగిస్తూ, థియేటర్‌లో ఒక గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాను ఆస్వాదించాలనే ఉత్సాహాన్ని ప్రేక్షకుల్లో నింపుతోంది.

Exit mobile version