Site icon NTV Telugu

Manchu Manoj : 100 కోట్ల “మిరాయ్”..మంచు మనోజ్ కు “డేవిడ్ రెడ్డి” కంగ్రాట్స్

David Reddy

David Reddy

సూపర్ హీరో తేజ సజ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీక్‌లో కూడా హౌస్ ఫుల్స్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. “మిరాయ్”లో మంచు మనోజ్ చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. “మిరాయ్” ఘన విజయం నేపథ్యంలో మంచు మనోజ్ కు శుభాకాంక్షలు చెప్పింది ఆయన నెక్ట్స్ మూవీ “డేవిడ్ రెడ్డి” టీమ్.

Also Read:OG: పవన్‌ కల్యాణ్‌ OG సినిమా టికెట్‌ వేలంకు రికార్డ్‌ ధర

మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ గా నటించిన “మిరాయ్” సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరినందుకు కంగ్రాట్స్ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు “డేవిడ్ రెడ్డి” టీమ్. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కనుంది

Exit mobile version