Sreeleela : బాలీవుడ్‌లో జోరు మీదున్న డాన్సింగ్ డాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిసిక్ అంటూ టీటౌన్‌లో కాదు బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అంతకు ముందు సుమారు డజన్ సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ పుష్ప2 స్పెషల్ సాంగ్‌తో తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో సౌత్‌లో కాస్త క్లిక్ అయితే చాలు ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అమ్మడు. దీనికి ఆషికి 3 అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read : Bollywood : ఇండో-పాక్ వార్.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న స్టార్ హీరో సినిమా
Also Read
అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిజల్ట్ తేలకుండానే మరో ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల. యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సరసన జోడీ కడుతోంది. దర్శకుడు రాజ్ సాండియాలా నెక్ట్స్ ఫిల్మ్‌లో కమిటైనట్లు తెలుస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని సమాచారం. బాలీవుడ్‌లో ఈ క్రేజీ ఆఫర్లు చూస్తుంటే మేడమ్ ఫేట్ ను వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు చేస్తే నాలుగు మాత్రమే సూపర్ హిట్స్. అందులో ఒకటి స్పెషల్ సాంగ్. మిగిలినవన్నీ ప్లాప్సే. అయినప్పటికీ ఇప్పటికీ ఆఫర్లు కొల్లగొడుతూనే ఉంది. మాస్ జాతర, లెనిన్ లైన్ లో ఉన్నాయి. చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. ఇవేకాదు తమిళంలో పరాశక్తితో ఎంట్రీ ఇవ్వబోతుంది. శ్రీ లీల కెరీర్ లో భయకంరమైన ప్లాప్స్ ఉన్నా బాలీవుడ్ పిలిచి మరి ఆఫర్స్ ఇస్తోంది. ఇక ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజయ్యే సరికి ఇంకా ఎన్ని ఆఫర్లను అందిస్తుందో ఈ బాలీవుడ్.
తాజావార్తలు
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
-
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
-
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్‌న్యూస్..ఇండియాలో వర్షాలు..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!