NTV Telugu Site icon

DaakuMaharaajEvent : డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Daaku

Daaku

వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది.

Also Read : OTT: లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారిగా ప్లాన్ చేసాడు నిర్మాత నాగవంశీ. రానున్న నూతన నూతన సంవత్సరం జనవరి 4న USAలోని డల్లాస్, టెక్సాస్ లో సాయంత్రం 6.00 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగ వంశి. తన అభిమాన హీరో ఫంక్షన్ ను అందరూ చాలా కాలం మాట్లాడుకునేలా గ్రాండ్ గా చేయాలని నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు. ఓవర్సీస్ లో ఈ సినిమాను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తొలిసారి అమెరికాలో జరుగుతుండడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రేయాస్  మీడియా ఆధ్వర్యంలో జరుగనుంది.

Show comments