NTV Telugu Site icon

Daayra : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన కరీనా కపూర్

Pkm

Pkm

మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇటీవలే ‘ఆడుజీవితం’తో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు గాను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కు అనేక అవార్డులు వరించాయి. దాదాపు 16 సంవత్సరాల పాటు శ్రమించి ఆడు జీవితంను నిర్మించాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. రిలీజ్ తర్వాత ఈ హీరో కష్టానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ జోష్ లో ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Also Read : kanguva : ‘పుష్ప’రాజ్ ను ఫాలో అవుతున్న కంగువ..

బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో పృథ్వీరాజ్‌ ను సంప్రదించినట్టు మలయాళ సినిమా వర్గాలు పేర్కొన్నాయి. మేఘనా గుల్జార్‌ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. ఈ సినిమాకు ‘దైరా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు మొదట బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ను ఎంపిక చేశారట. కానీ అనుకోని కారణాల వలన ఆయుష్మాన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఇక మరొక యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాను సంప్రదించగా కాల్‌షీట్స్‌ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. వాస్తవ సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోలీసుగా కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాల్ని అధికారికంగా  ప్రకటించనున్నారు. మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఎంపురన్ లోను నటిస్తున్నాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

Show comments