Site icon NTV Telugu

Court : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన..!

Court Movie Ott

Court Movie Ott

ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. నాని సమర్పించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్..

Also Read : Puri – Sethupathi: టబు ఆన్ డ్యూటీ సర్..

ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ‘కోర్ట్’ మూవీ స్ట్రీమింగ్ చేయనున్నారట. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిందట నెట్ ఫ్లిక్స్ సంస్థ. హీరో నాని సమర్పించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. థియేటర్లలో తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కథ ప్రకారం యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీకి OTT లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Exit mobile version