లోకేష్ కనగరాజ్ త్వరలో కూలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజానికి లోకేష్ దర్శకత్వానికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది. రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్న కూలీ సినిమా గురించి ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మౌనిక సాంగ్ అయితే ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది.
Also Read:8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు!
పూజా హెగ్డే డాన్స్ చేయగా, ఆమెతోపాటు సౌబిన్ షహీర్ కూడా అంతే ఎనర్జీతో చేసిన డాన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ పేరు మాలేనా అని చెప్పుకొచ్చారు. నిజానికి తనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా మౌనిక బెలూచీకి పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చారు.
Also Read:Mega 157: సాంగేసుకుంటున్న చిరు, నయనతార
చిన్నప్పుడు ఆమె అంటే చాలా ఇష్టమని ఆమె వారు వెల్లడించారు. నిజానికి మౌనిక నటించిన మాలేనా సినిమా అప్పట్లో టీనేజర్స్ అందరికీ హాట్ ఫేవరెట్. హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అప్పట్లో తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు అదే పేరుతో పూజా హెగ్డేకి క్యారెక్టర్ రాసుకోవడం అంటే వారికి మౌనిక మీద ఎంత లవ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
