లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో కూలీ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు ఉపేంద్ర రజనీకాంత్‌ని అరగంట పాటు నిలబడి చూస్తూ ఉండిపోయాడని, ఆ సమయంలో ఆయన కళ్ల వెంట నీళ్లు రావడం తాను గమనించానని లోకేష్ చెప్పుకొచ్చాడు.
Also Read : Mahavatar Narsimha : నెమ్మదిగా థియేటర్లు పెరుగుతున్నాయ్!
తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన లోకేష్, సుమారు అరగంట పాటు కన్నీళ్లు పెట్టుకుని, అనంతరం తాను రజనీకాంత్‌కి ఎంత పెద్ద అభిమానిని అనే విషయాన్ని తనకు వెల్లడించినట్లు లోకేష్ చెప్పాడు. ఇక కూలీ సినిమా మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా అలరించేలా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌కి ఒక మంచి బ్రాండ్ ఏర్పడింది. ఆ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెంచేలా ఈ కూలీ సినిమా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ సహా పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే కూలీ నుంచి విడుదలైన సాంగ్స్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
