బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దర్శకులకు హ్యాండిస్తున్నాడు. ఇటీవల రజనీకాంత్ కోసం కూలీలో ఓ స్పెషల్ క్యామియో చేశాడు అమీర్. ఈ టైంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో సాన్నిహిత్యం పెరిగి. అతడికి ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. ఓ సూపర్ హీరో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు లోకీ. నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కుతుందని లోకి, అమీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ చెడిందో కానీ ఈ సినిమాను అలా పక్కన పెట్టాడు.
Also Read : Prabhas : అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ప్రభాస్ సై అంటే సై
లోకేశ్ కనగరాజ్ తో మాత్రమే కాదు తన కెరీర్నో మంచి హిట్స్ ఇచ్చిన రాజ్ కుమార్ హిరానీతో కూడా కొర్రీలు పెట్టుకున్నాడు అమీర్ ఖాన్. హిరానీ – అమీర్ కాంబోలో వచ్చిన త్రీ ఇడియట్స్, పీకే చిత్రాలు బ్లాక్ బస్టర్స్. మళ్లీ ఈ కాంబో రిపీట్ కావాల్సి ఉంది. దాదా సాహెబ్ పాల్కే బయోపిక్ తీయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయట. స్క్రిప్ట్ డల్ గా ఉందని, హ్యుమర్ లేదని మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంకలు చెబుతుండటంతో హిరానీ కూడా ప్రాజెక్టుపై ఫోకస్ చేయలేకపోతున్నాడట. ఇక మ్యూచువల్ కన్సల్ట్ తో ఈ ప్రాజెక్టు ఆపేశారని బాలీవుడ్ మీడియా టాక్. 60 ఏళ్ల వయస్సులో మూడో సారి ప్రేమలో పడిన అమీర్ ఖాన్ వయస్సుకు తగ్గ పాత్రలే ఎంచుకుంటున్నాడు కానీ హిట్స్ దక్కడం లేదు. దంగల్ తర్వాత ఆ స్థాయి హిట్ చూడలేదు మిస్టర్ ఫర్ ఫెక్ట్. కానీ నిర్మాతగా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది సితారే జమీన్ పర్, కూలీలో చేసిన దహా క్యారెక్టర్ కూడా సోసో అనిపించుకున్నాయి. మరి అమిర్ ఖాన్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడో చూడాలి.
