Muthayya: ‘ముత్తయ్య’ నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం ‘ముత్తయ్య’. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘ముత్తయ్య’ త్వరలో ఈటీవీ విన్‌లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘ముత్తయ్య’ చిత్రం నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాటను విడుదల చేశారు. ఈ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడకుండా కలలను సాకారం చేసుకోవాలని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా తెలిపారు. ‘ముత్తయ్య’ టీమ్‌కు తన శుభాకాంక్షలు అందించారు.
Madhubala: హీరోయిన్ మధుబాల లవ్ స్టోరీ.. అండర్‌వరల్డ్‌తో సంబంధం?
Also Read
‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్స్ అద్భుతమైన ట్యూన్‌తో స్వరపరిచారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ముత్తయ్య పాత్రను ప్రతిబింబిస్తూ సాహిత్యం రాయగా, చిన్నా.కె. ఆకర్షణీయంగా ఆలపించారు. పాట సారాంశం ఇలా ఉంది: ‘సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా… బుట్టలల్లుకుంట ఊళ్లె మిలిగిపోతవా.. ముత్తయ్య… తిక్క తిక్క ఈడియోలు జేసుకుంటవా.. స్టెప్పులేసి ఎగిరి దుంకి సంపుతుంటవా.. ముత్తయ్య…. పేమసైతవా పేళ్లు గోళ్లు గిల్తవా… దేశమంత లొల్లి జేస్తావా… డ్యాన్సు జేస్తవా డయ్యిలాగు జెబుతవా ఓపికంత కూడ వెడ్తావా… ముత్తయ్య..’ అంటూ ముత్తయ్య వెండితెర కలను చిత్రీకరిస్తూ ఈ పాట సాగుతుంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!