Sai Rajesh: ‘వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం’ ‘బేబీ’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Rajesh: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్ర నిర్మాత ‘ధీరజ్ మొగిలినేని’ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చేసిన ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బేబీ సినిమా తీసినప్పటికీ ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఒక వేళ ఇప్పుడు ఈ టైంలో బేబీ రిలీజ్ అయ్యి ఉంటే సగం షేర్ కూడా వచ్చేది కాదని చెప్పారు.
‘ఈ మధ్య ఏదైనా కంటెంట్ రిలీజ్ చెయ్యాలంటే కూడా చాలా భయం వేస్తుందని, ఎందుకంటే యూట్యూబ్ వ్యూస్ కొనేస్తున్నాం, డబ్బులు ఇచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం, ట్విట్టర్లో ఎవరైనా నెగటివ్‌గా రాస్తే వాటిని సైతం మన సినిమాకి అనుకువుగా పాజిటివ్‌గా మారుస్తున్నాం, వీటి అన్నిటి మధ్య మన కంటెంట్ నిజంగా జనాలకి నచ్చిందో? లేదో? అనేది తెలియడం లేదు. నిజానికి ఇలాంటి పనులు కారణంగా జనాలకి కూడా మన మీద విరక్తి వచ్చేసింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో మా లాంటి మేకర్స్‌కు ఎలాంటి కథలు రాయాలి, ఎలాంటి సినిమాలు తీయాలి అనే భయం ఏర్పడిపోయింది’ అని అన్నారు. సాయి రాజేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గా్ల్లో కూడా చర్చనియాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘కిరణ్ అబ్బవరం’ హీరో ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా కష్ట కాలంలో ఉందని అన్నారు. ఆడియెన్స్‌ను థియేటర్‌కి రప్పించడమే మనందరికీ పెద్ద సవాల్ అని, ఈ విషయాలను నేను భయపడకుండా ధైర్యంగా కూడా చెప్పగలను అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!