Sai Rajesh: ‘వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం’ ‘బేబీ’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

Sai Rajesh

Sai Rajesh

Sai Rajesh: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్ర నిర్మాత ‘ధీరజ్ మొగిలినేని’ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చేసిన ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బేబీ సినిమా తీసినప్పటికీ ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఒక వేళ ఇప్పుడు ఈ టైంలో బేబీ రిలీజ్ అయ్యి ఉంటే సగం షేర్ కూడా వచ్చేది కాదని చెప్పారు.

‘ఈ మధ్య ఏదైనా కంటెంట్ రిలీజ్ చెయ్యాలంటే కూడా చాలా భయం వేస్తుందని, ఎందుకంటే యూట్యూబ్ వ్యూస్ కొనేస్తున్నాం, డబ్బులు ఇచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం, ట్విట్టర్‌లో ఎవరైనా నెగటివ్‌గా రాస్తే వాటిని సైతం మన సినిమాకి అనుకువుగా పాజిటివ్‌గా మారుస్తున్నాం, వీటి అన్నిటి మధ్య మన కంటెంట్ నిజంగా జనాలకి నచ్చిందో? లేదో? అనేది తెలియడం లేదు. నిజానికి ఇలాంటి పనులు కారణంగా జనాలకి కూడా మన మీద విరక్తి వచ్చేసింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో మా లాంటి మేకర్స్‌కు ఎలాంటి కథలు రాయాలి, ఎలాంటి సినిమాలు తీయాలి అనే భయం ఏర్పడిపోయింది’ అని అన్నారు. సాయి రాజేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గా్ల్లో కూడా చర్చనియాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘కిరణ్ అబ్బవరం’ హీరో ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా కష్ట కాలంలో ఉందని అన్నారు. ఆడియెన్స్‌ను థియేటర్‌కి రప్పించడమే మనందరికీ పెద్ద సవాల్ అని, ఈ విషయాలను నేను భయపడకుండా ధైర్యంగా కూడా చెప్పగలను అని అన్నారు.