చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గురించి టాలీవుడ్ వర్గాల వారికి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు.
Also Read : Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు
మీడియా, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు, సినీ పరిశ్రమ సంఘాలు అలాగే చిత్రపురి కాలనీలో జరుగుతున్న ఆరోపణలపై సందేహాలున్న సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్‌లో ఆయన వారందరికీ సమాధానాలు ఇస్తానని వెల్లడించారు. చిత్రపురి కాలనీపై పదేపదే ఆరోపణలు చేస్తున్న వారికి, పోరాటాలు, ధర్నాలు చేస్తున్న వారికి, అందరి సందేహాలు నివృత్తి చేయడానికి చిత్రపురి కమిటీ మేము ఎందుకు రాబోతోంది.
Also Read : Hari Hara Veera Mallu: చివరి నిముషంలో ‘ఒడ్డున’ పడేసిన ఆ ఇద్దరు నిర్మాతలు!
చిత్రపురి కాలనీపై ఉన్న సందేహాలు, అపోహలు అన్నీ ఆధారాలతో ఈ చర్చకు వచ్చి, మంచి నిర్ణయాలతో ముందుకు సాగి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చిత్రపురి అయిన సందేహాలు ఉన్న వారందరూ పాల్గొని వారి సందేహాలకు సమాధానాలు పొందాలని ఆయన కోరారు. మీరు అందుబాటులో లేకపోతే మీ ప్రతినిధినైనా పంపించాలని, చిత్రపురిపై వస్తున్న ఆటంకాలు ఈ సమావేశం చివరి సమావేశం అవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
