Site icon NTV Telugu

Chiranjeevi: చిరు సినిమా కథ లీక్ చేసిన ‘మీసాల పిల్ల’

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల..’ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. అయితే ఈ పాటతో పాటు, సినిమాలోని కీలక సన్నివేశాలు, కథాంశం (స్టోరీ లైన్) కూడా లీక్ అవడం చర్చనీయాంశమైంది.

Also Read :Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’

గతంలోనే ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు, సీన్స్ అనుకోకుండా లీక్ అయ్యాయి. తాజాగా విడుదలైన ‘మీసాల పిల్ల..’ పాట లిరిక్స్ ద్వారా సినిమా కథాంశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కావాలనే లీక్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
* ఈ సినిమాలో చిరంజీవి, నయనతార విడిపోయిన భార్యాభర్తలుగా నటించారని పాట ద్వారా తెలుస్తోంది.
* 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని, అభిమానులు వింటేజ్ చిరంజీవిని చూశారని అనిల్ రావిపూడి ఈ పాట ద్వారా చూపించారు.
* ఇంతకుముందు విడుదలైన ‘గోదారి గట్టు..’ పాట ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే హైప్‌ను పెంచగా, తాజాగా విడుదలైన ‘మీసాల పిల్ల..’ పాట ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది.

Also Read :Siddu Jonnalagadda: హిట్ అయితే అందరికీ క్రెడిట్, పోతే నా మీదే బ్లేమ్

కథను ముందు చెప్పడం వెనుక దర్శకుడి వ్యూహం ఏంటి?
‘మన శంకరవరప్రసాద్‌గారు’కు సంబంధించిన ఫోటోలు, సీన్సే కాదు, స్టోరీ లైన్ కూడా లీక్ అయింది. సాధారణంగా, సినిమా కథను సస్పెన్స్‌గా ఉంచాలని దర్శక నిర్మాతలు భావిస్తారు. కానీ, ఈ చిత్రంలో కథ ఏమిటో ముందు చెప్పేయడంతో దర్శకుడికి వచ్చిన లాభం ఏంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. అనిల్ రావిపూడి తన చిత్రాల్లో ఎమోషన్ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కథాంశం కంటే, ఆ కథను ఎలా తీశారు, చిరంజీవిని ఎంత గ్రేస్‌ఫుల్‌గా చూపించారనేది కీలకంగా మారుతుందని దర్శకుడు భావించి ఉండవచ్చు. కథాంశాన్ని ముందుగా లీక్ చేయడం ద్వారా, హైప్‌ను పెంచడమే కాకుండా, సినిమాలోని ఎమోషనల్ పాయింట్‌కు ప్రేక్షకులు ముందుగానే కనెక్ట్ అయ్యేలా చేయాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

Exit mobile version