Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi’s Kaaka Movie Latest Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
కాకా డబ్బింగ్ వర్క్ మొదలైన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. ‘కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. కాకా జనవరి 13 2027న సంక్రాంతి కానుకగా రాబోతోంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీంతో కాకా సంక్రాంతి విడుదలపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. గతంలో ఈ సినిమాను వాయిదా వేసి.. అదే సమయంలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు ప్రకటించడంతో కాకా విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గడం లేదనే విషయం స్పష్టమైంది.
Also Read
ఇక చిరంజీవి, బాబీ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత మరోసారి కలిసి పనిచేస్తుండటంతో కాకాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
And the Dubbing Starts to set THE BLOODY BENCHMARK ….🎙️🔥#KAAKA – JAN 13th Sankranthi 2027❤️🔥#KAAKAOnJan13 pic.twitter.com/hGHTxLJ0bK
— Kaaka (@KaakaMovie) September 25, 2026
- Tags
- Bobby
- Chiranjeevi
- Kaaka
- Kaaka Movie
తాజావార్తలు
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!