Site icon NTV Telugu

Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

చిరంజీవి నుంచి రాబోతున్న వరుస సినిమాల్లో ‘విశ్వంభ‌ర‌’ ఒకటి. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా ప‌డింది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వ‌ల‌నే బాగా ఆలస్యం అవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇది. అందుకని వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు . గతంలో చిరంజీవి ఇదే తరహాలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన విష‌యం తెలిసిందే. కాగా ఈ మూవీలో కూడా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లోని వినోదం కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Also Read : Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !

ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే. ఈ రోజు, త్రిష పుట్టినరోజు. ఈ క్రమంలో త్రిషకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో త్రిష అవని పాత్ర పోషిస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఇక పోస్టర్‌లో త్రిష లుక్ అద్భుతంగా ఉంది.ఇక ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version