Site icon NTV Telugu

Chiranjeevi Hits: రీ-ఎంట్రీలో చిరంజీవి హిట్స్.. ఈ ఆసక్తికర విషయం తెలుసా?

Chiranjeevi, Catherine Tresa

Chiranjeevi, Catherine Tresa

‘మెగాస్టార్’ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాలు అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. కంబ్యాక్ అనంతరం చిరంజీవి నటించిన సినిమాల్లో ‘ఖైదీ నెం.150’, ‘వాల్తేరు వీరయ్య’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ హిట్స్‌గా నిలిచాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరోసారి నిరూపించాయి. అయితే ఈ సినిమాల వెనక ఓ ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. హీరోయిన్ కేథ‌రిన్ థ్రెసా ఆ కనెక్షన్.

Also Read: Shiva Jyothi : నా ప్రెగ్నెన్సీపై అడ్డమైన వాగుడు ఆపండి.. ట్రోలర్స్‌కు శివజ్యోతి స్ట్రాంగ్ వార్నింగ్!

కేథ‌రిన్ థ్రెసా, చిరంజీవిలు ఇప్పటివరకు జంటగా నటించలేదు. ‘వాల్తేరు వీరయ్య’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల్లో ఆమె కీలక పాత్రల్లో కనిపించారు. రెండు సినిమాల్లోనూ ఆమె ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. కథకు అవసరమైన గ్లామర్‌తో పాటు బలమైన పాత్రలతో ఆకట్టుకున్నారు. అంతేకాదు ‘ఖైదీ నెం.150’ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మొదట్లో ఆ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం కేథ‌రిన్ థ్రెసాను ఎంపిక చేశారు. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు ఆమె స్థానంలో లక్ష్మీ రాయ్ వచ్చారు. ఈ మూడు సినిమాల వెనుక ఉన్న ఈ చిన్న ట్రివియా.. మెగాస్టార్ అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొత్తంగా చిరంజీవి కంబ్యాక్ తర్వాత వచ్చిన ఈ సినిమాల చుట్టూ ఉన్న ఇలాంటి ఆసక్తికర విషయాలు టాలీవుడ్‌లో చర్చనీయాంగా మారాయి.

Exit mobile version