Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఆంజనేయస్వామి నామస్మరణతో మృత్యువు అంచుల దాకా వెళ్లి ఒంటిచేత్తో 174 మంది ప్రాణాలను కాపాడిన ఆ రియల్ హీరో ఎవరో కాదు.. మన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్. ఆకాశంలో చోటుచేసుకున్న ఈ అపూర్వ సాహసగాథ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించి చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి.
మరణం కళ్లముందు నర్తిస్తున్న సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ హనుమాన్ చాలీసా జపిస్తూ మనోధైర్యాన్ని నింపుకున్నారన్న వార్త తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఆయన కెప్టెన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.. “తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై కాపాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్!” అంటూ చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
అసలేం జరిగిందంటే.. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో (FZ1073) 174 మంది ప్రయాణికులు ఉన్నారు. సరిగ్గా ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ ఊహించని విధంగా కెప్టెన్ స్మిత్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, విమానాన్ని నేలకేసి కొట్టేందుకు ప్రయత్నించాడు. క్షణాల వ్యవధిలోనే విమానం సుమారు 14,000 అడుగుల మేర కిందకు దూసుకువచ్చింది. మెడ, ఛాతీపై బలమైన గాయాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ వెనక్కి తగ్గలేదు. ప్రాణభయంతో వణికిపోకుండా సమయస్ఫూర్తితో కాక్‌పిట్ డోర్ ఎమర్జెన్సీ లాక్‌ను తెరిచి ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చేలా చేశారు. వెంటనే ఇతర సిబ్బంది సహకారంతో దుండగుడిని బంధించి, విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని తబూక్లో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. రక్తం ఓడుతూ కూడా తోటి వారి ప్రాణాల కోసం ఒంటరి పోరాటం చేసిన ఈ భారతీయ పైలట్ తెగువ, దైవభక్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. భారతీయుడి గుండెధైర్యం, ఆపత్కాలంలో తోడ్పడిన హనుమంతుడి భక్తి విశ్వవ్యాప్తంగా మరోసారి సగర్వంగా నిలిచాయి.
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2026
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!