Site icon NTV Telugu

Chiranjeevi : ‘చిరు – అనిల్ రావిపూడి’ మూవీ షూటింగ్ అప్ డేట్..!

Chiranjeevi, Anil Ravipudi,

Chiranjeevi, Anil Ravipudi,

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి , మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదానికి పూచీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో పాటు ఇతర కీలక నటీనటులు కూడా పాల్గొంటారని సమాచారం. సినిమా మొత్తంలో ఈ సీక్వెన్స్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ అంటోంది.

Also Read : Atlee : ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్.. !

అలాగే వచ్చే వారం జరగనున్న ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై కొన్ని ఫ్యామిలీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల్లో కామెడీ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిరు – నయనతార మధ్య వచ్చే ఈ కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని అలరిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం..సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

Exit mobile version