Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గానీ, స్నేహితుల మధ్య ఉన్నప్పుడు గానీ కొందరు తనను మందు తాగాలని ఒత్తిడి చేశారని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అయితే, తాను ఆంజనేయ స్వామి భక్తుడినని చెప్పి ఆ అలవాటుకు ఆమడదూరంలో ఉండిపోయానని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న చిరంజీవి, తన జీవిత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ యువతలో కొత్త ఉత్సాహం నింపారు.
సభలో యువతను ఉద్దేశించి చిరంజీవి చాలా సూటిగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. “చాలామంది ‘ఒక్కసారే కదా ఏమవుతుందిలే’ అని మద్యం, డ్రగ్స్ వైపు అడుగులు వేస్తుంటారు. కానీ ఆ ఒక్కసారే మన జీవిత లక్ష్యాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. నేను నా లక్ష్యం మీద పూర్తి ఫోకస్ పెట్టబట్టే ఈరోజు మెగాస్టార్‌గా మీ ముందు నిలబడగలిగాను. మీరు కూడా మీకు ఇష్టమైన రంగాల్లో రాణించి నిజమైన హీరోలుగా ఎదగాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లుగా స్థిరపడి మీ తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచాలి” అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు బానిసైతే కేవలం ఒక్క వ్యక్తే కాకుండా, ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని ఆయన హెచ్చరించారు.
Also Read
డ్రగ్స్ బారిన పడిన వారి పట్ల సమాజం, స్నేహితులు ఎలా వ్యవహరించాలో చిరంజీవి చక్కగా వివరించారు. “మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా పొరపాటున డ్రగ్స్‌కు బానిసైతే వారిని అసహ్యించుకోకండి, సానుభూతితో అండగా నిలబడండి. మన పోరాటం డ్రగ్స్ మీద మాత్రమే.. డ్రగ్స్ బారిన పడిన వాళ్ల మీద కాదు” అని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని అద్భుతమైన యువశక్తి మన సొంతమని, మన యువత సరైన మార్గంలో నడిస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ లక్ష్యమైన ‘డ్రగ్స్ రహిత భారత్’ ఆశయాన్ని కిషన్ రెడ్డి తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారని అభినందించారు. పాదయాత్ర వల్ల కిషన్ రెడ్డి గొంతు బొంగురుపోవడంపై స్పందిస్తూ.. “కిషన్ రెడ్డి వాయిస్ ఎక్కడికీ పోలేదు, ఆయన తన గళాన్ని మనందరికీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని, లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి” అంటూ మెగాస్టార్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
-
Tata Group: టాటా గ్రూప్‌లో కుమ్ములాట.. హైకోర్టు మెట్లు ఎక్కిన ట్రస్టులు!
-
MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
-
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!