Site icon NTV Telugu

Mangli: ఎంతటి ప్రముఖులైనా వదలం.. మంగ్లీ ఇష్యూపై పోలీసుల సీరియస్ వార్నింగ్!

Mangli Warning

Mangli Warning

అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎంతటి ప్రముఖులైనా, ఎవరు ఎంతటివారైనా, చట్టాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని వాడే వారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడం అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.

Also Read:Jr NTR : బన్నీ మిస్సైన కథతో జూనియర్ ఎన్టీఆర్.. నాగవంశీ హింట్స్!

శివారు ప్రాంతాల్లో క్లబ్బులుగా మారిన రిసార్టులలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. తాజాగా చేవెళ్ల త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టిన రోజు వేడుకలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అంశంలో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, పర్మిషన్ లేకుండా మద్యం వాడకంపై కేసులు నమోదయ్యాయి.

Also Read:Singer Mangli: వీడియో ఆపుతావా.. లేదా? మంగ్లీ ఓవర్ యాక్షన్!

మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసు పెట్టారు. ఇక ఈ క్రమంలో దామోదర్ రెడ్డికి గంజాయి టెస్టులో పాజిటివ్ రాగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పార్టీలో మొత్తం 48 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. బిగ్ బాస్ ఫేమ్ దివితో పాటు లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

Exit mobile version