బాలీవుడ్ నుండి రీసెంట్‌గా విడుదలైన ‘ఛావా’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం, మన పూర్వీకుల గొప్పతనాన్ని, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టింది. దీంతో ఈ చరిత్ర తెలుసుకునేందుకు పిల్లలు, పెద్దలు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ పరిణామాలతో ‘ఛావా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు, ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ఊహించని విధంగా అభ్యంతరం వ్యక్తం అయినట్లు తెలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరులో ఈ చిత్రం తెలుగు రిలీజ్‌ని నిలపాలని ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జియా ఉల్ హకీ అక్కడి జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందించినట్టు సమాచారం. ఎందుకంటే ఈ ‘ఛావా’ మూవీ తెలుగులో కనుక రిలీజ్ అయితే మాట ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, ఈ చిత్రం చరిత్రకి సంబంధం లేకుండా 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా ఈ మూవీలో చిత్రీకరించారు అని వారు తెలుపుతున్నారు. దీంతో ఉత్తర భారతంలో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతాయి అని, అందుకే ఈ సినిమా తెలుగు రిలీజ్‌ని ఆపాలని వారు కోరుతూన్నారు. ప్రజంట్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.