Chandrahas Controversy: ఇదేమి ‘యాటిట్యూడ్’ చంద్రహాస్.. మస్త్ ఉందిలే!
- తెలుగు సినిమా అంటే ఇవాళ ఒక బ్రాండ్
- నార్త్ నుంచి జపాన్ దాకా 'తెలుగు' అనే మాట ఒక ప్రభంజనం
- వెలుగుల వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా
- అహంకారాన్ని నెత్తినేసుకుని తిరుగుతున్న కుర్ర హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barabar Premista Movie Hero Chandrahas Controversy: తెలుగు సినిమా అంటే ఇవాళ ఒక బ్రాండ్. నార్త్ నుంచి సౌత్ దాకా, అమెరికా నుంచి జపాన్ దాకా ‘తెలుగు’ అనే మాట ఒక ప్రభంజనం. మన నటుల క్రమశిక్షణ, మన దర్శకుల సృజనాత్మకత మనల్ని ప్రపంచం నెత్తిన కూర్చోబెట్టాయి. కానీ.. ఈ వెలుగుల వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా తయారవుతున్నాయి. టాలెంట్ అంటే ఏంటో తెలియక ముందే.. స్టార్డమ్ అంటే అర్థం కాకముందే.. కొందరు కుర్ర హీరోలు అహంకారాన్ని నెత్తినేసుకుని తిరుగుతున్నారు. ‘యాటిట్యూడ్ స్టార్’ అని పిలిపించుకుంటున్న చంద్రహాస్.. ఇప్పుడు చేస్తున్న రచ్చ చూస్తుంటే ఒక అద్భుతమైన పరిశ్రమ పరువును బజారున పడేస్తున్నట్లు కనిపిస్తోంది.
‘బరాబర్ ప్రేమిస్తా’.. ఈ సినిమా టైటిల్లో ఉన్నంత ప్రేమ, ఆ సినిమా ప్రమోషన్లలో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సాక్షిగా చంద్రహాస్ తనలోని అసలైన ‘యాటిట్యూడ్’ను బయటపెట్టాడు. సినిమాలోని క్యారెక్టర్ గురించి చెప్తున్నానని అంటూనే.. అత్యంత అసభ్యకరమైన, సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో పాట పాడాడు. వేదికపై తన తల్లిదండ్రులు ఉండగానే.. ఆ బూతులు ఎలా నోటికొచ్చాయి?. ఇండస్ట్రీలో సీనియర్ నటులు, మహిళలు ఉన్నారని కూడా మర్చిపోయారా?. సినిమాలో బూతులు ఉండటం వేరు.. లైవ్ ఈవెంట్లో, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై మైక్ పట్టుకుని బూతులు వాడటం వేరు. ఇది కేవలం పొరపాటు కాదు.. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన పబ్లిసిటీ స్టంట్.
Also Read
- Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
- Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
- King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
- Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
టాలీవుడ్ ఎప్పుడూ ఒక పద్ధతిని, ఒక సంప్రదాయాన్ని పాటిస్తుంది. పెద్దలను గౌరవించడం, మహిళల పట్ల మర్యాదగా ఉండటం మన ఇండస్ట్రీ నేర్పిన పాఠం. కానీ చంద్రహాస్ ఈవెంట్లో ఇవన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఆ సమయంలో వేదికపై ఉన్న సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఆయన వెంటనే స్పందించి.. తన తప్పును ఒప్పుకున్నారు. ‘ఆ ఈవెంట్ నుంచి తాను వెళ్ళిపోవాల్సింది’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్ల పేరుతో మహిళలను కించపరచడం, బూతులు వాడటం ముమ్మాటికీ క్షమార్హం కాని నేరం. కానీ చిత్ర యూనిట్ మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. నిర్మాతలు, దర్శకులు చెప్తున్న కారణాలు వింటుంటే.. తప్పును దిద్దుకోవడం కంటే, దాన్ని ఎలా కవర్ చేయాలనే ఆరాటమే కనిపిస్తోంది.
ఒక హీరోకి ఉండాల్సింది హుందాతనం. విమర్శలు వచ్చినప్పుడు స్వీకరించే మనస్తత్వం. కానీ చంద్రహాస్ తీరు అందుకు పూర్తి విరుద్ధం. తప్పును వేలెత్తి చూపిన జర్నలిస్టుపై సదరు హీరో ప్రతాపం చూపించారు. ‘క్షమాపణ చెప్పను.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని సవాల్ విసరడం ఇతడి అవివేకానికి నిదర్శనం. గతంలో కూడా తన నడక, తన యాక్టింగ్ స్టైల్ చూసి ప్రజలు నవ్వుకుంటుంటే.. దాన్ని కూడా ‘యాటిట్యూడ్’ అని బిల్డప్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. కనీసం ఒక చిన్న హిట్ లేకపోయినా.. ఆకాశమే హద్దుగా ప్రవర్తించడం చూస్తుంటే, టాలెంట్ కంటే ముందే అహంకారం ముదిరిపోయిందని అర్థమవుతోంది. దీని ఫలితంగానే ఇప్పుడు ఇతడిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. హీరో అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా ఉండకూడదు.
Also Read: Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్షా’ వైభవ్ నేపథ్యం ఇది!
ఒకప్పుడు నటుడు అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది, క్రమశిక్షణ నేర్చుకోవాల్సి వచ్చేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారు దశాబ్దాల పాటు కష్టపడి ఈ ఇండస్ట్రీని నిర్మించారు. కానీ ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకుని, చేతిలో డబ్బు ఉంది కదా అని హీరోలుగా మారిపోతున్న కొందరు.. ఆ గొప్పతనాన్ని బజారున పడేస్తున్నారు. పక్క రాష్ట్రాల వారు తెలుగు సినిమాను చూసి గర్విస్తుంటే.. ఇలాంటి వారి చేష్టల వల్ల మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి వస్తోంది. పబ్లిసిటీ కోసం బూతులు వాడటం, జర్నలిస్టులను బెదిరించడం వంటివి ‘చీప్ ట్రిక్స్’. ఇవి సినిమాలను హిట్ చేయవు.. కేవలం వ్యక్తిత్వాన్ని దిగజారుస్తాయి.
ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు. మీరు చేసే విన్యాసాలను, పాడే బూతు పాటలను చూసి వారు చప్పట్లు కొడతారనుకుంటే అది మీ భ్రమ. ఇప్పటికైనా మీ అహంకారాన్ని పక్కన పెట్టి, ఇండస్ట్రీ సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈ ‘యాటిట్యూడ్’ మిమ్మల్ని ఇండస్ట్రీకి కాకుండా చేస్తుంది.
తాజావార్తలు
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!