మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంగీత మేధావికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను నింపేస్తున్నారు ఆయన అభిమానులు. కీరవాణి అసలు పేరు కొడూరి మరకతమణి కీరవానీ. కీరవాణి మొట్టమొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా 1987లో ప్రముఖ స్వరకర్త కె.చక్రవర్తితో కలిసి తన కెరీర్ ను ప్రారంభించాడు. 1997లో తెలుగు చిత్రం “అన్నమయ్య”కు జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ మ్యూజిక్ లెజెండ్ 220 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. హిందీ చిత్రాలైన ఇస్ రాత్ కి సుబా నహిన్ (1996), సుర్ – ది మెలోడీ ఆఫ్ లైఫ్, జఖ్మ్, సయా, జిస్మ్, క్రిమినల్, రోగ్, పహేలి వంటి చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు.
Read Also : ఇక సిబిఎఫ్‌సి ఎందుకు?… సినిమాటోగ్రాఫ్ బిల్ పై సుధీర్ బాబు
ఇక రాజమౌళి-కీరవాణి కాంబినేషన్ లాగే… వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “బాహుబలి”తో కీరవాణికి సంగీత దర్శకుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం అందరి కళ్ళూ “ఆర్ఆర్ఆర్”పైనే ఉన్నాయి. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక కీరవాణి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.