ఖిలాడీ, రామబాణం సినిమాలలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి సినిమాల కంటే కూడా బయట వివాదాలలో ఏక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య కర్నాటక IPSతో వివాదం విషయంలో రచ్చ రచ్చ చేసింది డింపుల్. ఇక నిన్న మరో వివాదంలో హీరోయిన్ హయతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళని ఉన్నపలంగా బయటికి గెంటేసింది డింపుల్ హయతి. డింపుల్ హయతి ఇంట్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి వచ్చిన ఇద్దరు కొంతకాలంగా పని చేస్తున్నారు. వారితో వెట్టి చాకిరీ చేపించుకుని జీతం ఇవ్వకుండా చిత్ర హింసలను గురిచేస్తుందట డింపుల్. తమ డబ్బులు ఇవ్వమంటే తిరిగి వారిపైనే దాడి చేసి తన భర్త లాయర్ అంటూ బెదిరింపులకు దిగింది డింపుల్ హయతి.
Also Read : Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 ఎర్లీ ప్రీమియర్స్ క్యాన్సిల్..
దీంతో వారు హయతి ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ఆందోళనకు దిగారు. తమకు డబ్బులు ఇవ్వకుండా బయటికి గెంటేసారని కార్మికుల ఆరోపణ చేసారు. ఈ నేపధ్యంలో ఫిలింనగర్ లో హీరోయిన్ హయతి పై కేసు నమోదు అయింది. ఒడిస్సా కు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసారు పోలీసులు. హీరోయిన్ హయతి తో పాటు భర్త పైన కేసు నమోదు చేసిన పోలీసులుఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారని, తన నగ్న వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణతన చేత ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా బయటికి పంపేశారని, చిత్రహింసలు చేసిన హాయితీతోపాటు భర్తపై ఫిర్యాదు చేసింది పనిమనిషి.