Site icon NTV Telugu

Kannada : అబ్బే రూ. 100కోట్లు ఇవ్వందే సినిమా చేయలేము

Kollywood (3)

Kollywood (3)

బాహుబలి సౌత్ ఇండియా స్టామినాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళితే శాండిల్ వుడ్‌కు మహర్థశను తీసుకు వచ్చింది కేజీఎఫ్. రాఖీబాయ్ ఫెర్మామెన్స్‌కు బీటౌన్ బాక్సాఫీస్ షేకయ్యింది. కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్2 ధౌజండ్ క్రోర్ కొల్లగొట్టి ఖాన్స్ త్రయానికి బిగ్ షాక్ ఇచ్చింది. కన్నడ చిత్ర సీమలో కాలరెగరేసే మూవీగా మారడంతో పాటు అప్ కమింగ్స్ ఫిల్మ్స్ కు హోప్స్ ఇచ్చింది. ఇదే ధైర్యంతో రిషబ్ శెట్టి కాంతారతో సక్సెస్ అయ్యాడు. సుమారు రూ. 500 కోట్లను కొల్లగొట్టడంతో పాటు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాలిచ్చిన బూస్టప్ తో నెక్ట్స్ సినిమాలను సిద్దం చేస్తున్నారు ఈ ఇద్దరు.

Also Read : Raja Saab : తమన్ సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదా.. అందుకే దగ్గరుండి మరి.?

కేజీఎఫ్2, కాంతార భారీ హిట్స్ కావడంతో రాబోయే చిత్రాలు టాక్సిక్, కాంతార2లను ప్రెస్టిజియస్‌గా తీసుకున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక్కడ వరకు ఓకే కానీ ఈ ఇద్దరు హీరోలు కూడా రెమ్యునరేషన్స్ కూడా అమాంతం పెంచేశారు. టాక్సిక్ కోసం రూ. 50 కోట్ల నుండి 70 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. అలాగే బాలీవుడ్ యాంటిసిపెటెడ్ మూవీ రామాయణలో రావణాసురుడి పాత్ర కోసం రూ. 100 కోట్లు ప్లస్ నిర్మాతగా షేర్ ఉండటంతో లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడు రాఖీ బాయ్. కాంతారకు కేవలం ఐదు కోట్లు మాత్రమే చార్జ్ చేసిన రిషబ్ శెట్టి కూడా కాంతార ప్రీక్వెల్ కోసం రూ. 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అంటే సుమారు 2400 పర్సెంట్ ఫీజ్ హైక్ చేశాడు హీరో. ఇవే కాదు హనుమాన్, ద ప్రైడ్ ఆఫ్ భారత్ చిత్రాలకు కూడా ఇంచు మించు ఇంతే పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. వీరి రెమ్యునరేషన్ చూస్తుంటే బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా పనికిరానన్న డౌట్ వస్తుంది. కేజీఎఫ్ తర్వాత యష్, కాంతార తర్వాత వీరి నుండి మరో సినిమా రాలేదు. అదే వన్స్ బొమ్మ తల్లకిందులైతే.. ఆటోమేటిక్‌గా ఫీజులు తగ్గిపోతుంటాయి అది వేరే సంగతి.

Exit mobile version