Site icon NTV Telugu

Cannes 2025: తెలుగు సినిమాకు కేన్స్‌లో అపూర్వ గౌరవం!

M4m

M4m

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder) ప్రపంచ వేదికపై తన ఘనతను చాటుకుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, కేన్స్‌లోని ప్రతిష్ఠాత్మక PALAIS-C థియేటర్‌లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించబడింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టి గౌరవం పొందారు. స్క్రీనింగ్ అనంతరం ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమాకు కేన్స్‌లో ఇలాంటి గౌరవం దక్కడం అరుదైన విజయంగా నిలిచింది.

Also Read: Marriage Incentive Scheme: దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం..!

ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్‌లో దుబాయ్, ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా నైపుణ్యం అక్కడి మీడియా నుంచి ప్రశంసలు అందుకున్నాయి. మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్‌విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన ‘ఎం4ఎం’, కేన్స్ 2025లో ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. బలమైన కథనంతో పాటు సినిమాటిక్ అనుభవం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.

Also Read:Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?

తెలుగు సినిమాకు కేన్స్‌లో ఇటీవల కాలంలో లభిస్తున్న గౌరవం, ‘ఎం4ఎం’ సినిమాతో మరోసారి సాధ్యమైంది. ఈ ప్రీమియర్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా పేరుగాంచిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. జో శర్మ నటన కూడా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. త్వరలో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. భారతీయ ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ‘ఎం4ఎం’, విడుదలకు ముందే ప్రపంచ వేదికలపై ప్రశంసలు అందుకుంటూ, తెలుగు సినిమా సత్తాను చాటుతోంది.

Exit mobile version