NTV Telugu Site icon

Bunny Vasu: కల్కి కలెక్షన్స్ పై బన్నీ వాసు క్లారిటీ

Bunny Vas

Bunny Vas

Bunny Vasu Clarity on Kalki 2898 AD Collections: తాను కల్కి సినిమా కలెక్షన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అర్థం అయ్యాయని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాల నిర్మాణ బాధ్యతలు అన్ని అల్లు అరవింద్ బన్నీ వాసుకే అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఆయ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సింది కానీ ఒకరోజు వాయిదా వేసి 16వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ముచ్చటించాడు బన్నీ వాసు. ఈ సందర్భంగా కల్కి సినిమా కలెక్షన్స్ విషయంలో తాను అన్న మాటలు వేరేగా అర్థమయ్యాయి అని అన్నారు.

Malvi Malhotra: యోగేష్ కత్తితో పొడిచాడు.. అతనితో నేను చేసిన తప్పు అదే!

తనకు కల్కి సినిమా మీద ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని, మొదటిసారి ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాకి సుమారు 2000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తాయని ఊహించానని అన్నారు. ఆ స్థాయిలో రాలేదే ఈ సినిమాకి ఉన్న సత్తా వేరు. ఆ సత్తా ఉన్న స్థాయికి కలెక్షన్స్ రాలేదే అనే బాధతోనే ఆ మాట మాట్లాడాను కానీ కలెక్షన్స్ రాలేదు అనేది నా ఉద్దేశం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా నిర్మాతకు కూడా తన అభిప్రాయాన్ని ఇదే విధంగా కొందరు చెప్పారని అయితే అది కరెక్ట్ కాదని అన్నారు. ఆ సినిమాకి వచ్చిన టాక్ పాజిటివ్ కి సినిమా విజువల్స్ కి అన్ని కలగలిపి చూస్తే రెండు వేల కోట్లకు పైగానే రావాలి కానీ ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ అంత సాధించలేకపోయింది అనేది తన ఉద్దేశమని ఆయన కామెంట్ చేశారు..

Show comments