Site icon NTV Telugu

Brahmaji: అరె భాయ్ అదంతా జోక్.. మంచు విష్ణు 7000 ఎకరాలపై బ్రహ్మాజీ సంచలన పోస్ట్..!

Mohan Babu

Mohan Babu

Brahmaji: ప్రముఖ నటుడు మోహన్ బాబు, విష్ణులు న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న వీడియో అంటూ ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో సంబంధించి, మంచు వారితో కలిసి పాల్గొన్న సరదా సంభాషణను హాస్యంగా చిత్రీకరించిన వీడియోపై కొంతమంది అది నిజమని భావించడం మొదలుపెట్టారని.. దీంతో ఆ వీడియోను పోస్ట్ చేసిన బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ క్లారిటీ మెసేజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన X ఖాతా ద్వారా ఓ పెద్ద సమాచారాన్ని రాసుకొచ్చాడు. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే..

Read Also:IND vs ENG: 5 వికెట్లతో మెరిసిన బుమ్రా.. భారత్ కు స్వల్ప ఆధిక్యత..!

“గాయ్స్, కమ్ ఆన్..” అంటూ మొదలుపెట్టి.. మేము సరదాగా ముచ్చటిస్తూ నవ్వులు పూయించిన వీడియో అది. మేమంతా కలిసి నవ్వుకుంటూ వేసిన ఒక చిన్న జోక్ మాత్రమే. మేము న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనుగోలు చేశామట.. మోహన్ బాబు పూర్తిగా హాస్య భరితంగా చేసిన ఘటన, దానికి తోడు విష్ణు కూడా ఆయన కలిసిపోయాడు. నేను మామూలుగా చేసేలా వారిని ఆటపట్టించానని బ్రహ్మాజీ రాసుకొచ్చాడు. అయితే ఆ వీడియోలోని విషయాలను కొంతమంది నిజంగా అనుకోవడం ప్రారంభించడంతో, వెంటనే స్పష్టత ఇస్తున్నానని అన్నారు. అయ్యో భాయ్.. న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనడం అంత ఈజీ అయితే, ప్రతి వారాంతరం అక్కడే షూటింగ్ చేస్తున్నాను అంటూ సరదాగా స్పందించారు.

Read Also:IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!

అంతేకాదు, దయచేసి కామెడీని ఇంత సీరియస్‌గా తీసుకోవద్దండి. ఎవరూ ఎటువంటి భూములు కొనలేదు. మేమంతా సరదాగా మాట్లాడుకున్నాం అంతే. అంతేకాకుండా న్యూజిలాండ్ విదేశీయులకు ఆ స్థాయిలో భూములు కొనుగోలు చేసే అవకాశం కూడా ఇవ్వదు అంటూ స్పష్టం చేశారు. ఇక కన్నప్ప సినిమా రాబోతున్న తరుణంలో తమ టీం ఎంతో ఉత్సాహంగా ఉందని, అందులో భాగంగానే ఈ సరదా మాటలు జరిగాయని ఆయన తెలిపారు. ఇప్పుడు ఓ నవ్వు నవ్వండి.. హాస్యాన్ని హెడ్లైన్‌ గా మార్చొద్దండి అంటూ ముగించారు. దీనితో పెద్దెతున్న ఈ పోస్ట్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ క్లారిటీతో అభిమానులు నవ్వుతూ రిలాక్స్ అయ్యారు.

Exit mobile version