Site icon NTV Telugu

Bollywood : పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఇచ్చిన సౌత్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో

Karthik Aryan

Karthik Aryan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తీక్ ఆర్యన్ మంచి గేర్ మీదున్నాడు. భూల్ భూలయ్యా3 మాసివ్ హిట్టుతో కార్తీక్ రేంజ్ బీటౌన్‌లో పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు మరోటి సెట్ చేస్తున్నాడు. అయితే స్పీడులో ర్యాంగ్ డైవర్షన్ వైపు టర్న్ తీసుకుంటున్నాడు. తన లైనప్‌లో ఓ ప్లాప్ మేకర్‌కు ఛాన్స్ ఇచ్చాడట. పంజాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డిజాస్టర్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్‌ విష్ణు వర్థన్‌తో ఓ జాంబి ఫిల్మ్ చేయబోతున్నాడట కార్తీక్.

Also Read : Mollywood : మలయాళ ఇండస్ట్రీలో ‘ఓనం’ సినిమాల మధ్య పోటీ.. గెలిచేదెవరో?

విష్ణు తమిళంలో ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ కొన్ని రోజుల నుండి చెప్పుకోదగ్గ చిత్రాలేమీ లేవు. 2021లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సిద్దార్థ్ మల్హోత్రాతో ‘షేర్సా’ తెరకెక్కించాడు. పాండమిక్ కారణంగా బొమ్మ ఓటీటీకి పరిమితమైంది. మంచి వ్యూస్ దక్కించుకుంది. ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి తీసిన తమిళ్ ఫిల్మ్ నెసిప్పాయా బాక్సాఫీస్ బాంబ్‌గా మారింది. ఇప్పుడు ఇతగాడితో వర్క్ చేయాలనుకోవడం అంటే కార్తీక్ రిస్క్ చేస్తున్నట్లే.  బాలీవుడ్ హీరోలకూ రానూ రానూ కోలీవుడ్ దర్శకులపై ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. ఖాన్ త్రయానికి తమిళ ఫిల్మ్ మేకర్ల సత్తా ఏంటో తెలుసు సల్మాన్ ఖాన్- ప్రభుదేవాతో, షారూఖ్- అట్లీతో, లోకేశ్ కనగరాజ్‌తో అమీర్ ఖాన్ మంచి హిట్స్ చూశారు. వీళ్ల కెరీర్ డ్యామేజ్ అవుతున్న టైంలో తమకు బెస్ట్ ఫిల్మ్స్ కావాలనుకున్నప్పుడల్లా కోలీవుడ్ దర్శకులు స్టార్లకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను కార్తీక్ ఆర్యన్ కూడా వర్కౌట్ చేయాలనుకుంటున్నట్లున్నాడు. బాలీవుడ్ హీరోకు విష్ణు వర్ధన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version