Site icon NTV Telugu

Horror Movies: సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. హారర్ కామెడీ వైపు అగ్ర హీరోలు!

Bollywood Turns To Horror Comedy

Bollywood Turns To Horror Comedy

బాలీవుడ్‌లో హారర్ జోనర్‌కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతోన్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. భూత్ బంగ్లాతో హారర్ కామెడీ జోనర్‌లోకి యూటర్న్ తీసుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా హారర్ జోనర్‌పై ఫోకస్ చేస్తున్నాడట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ఇటీవల బాలీవుడ్‌‌లో హారర్ అండ్ హారర్ కామెడీ చిత్రాల హవా కాస్త తగ్గింది. కానీ ఈ జోనర్ పట్ల స్టార్ హీరోల ఆసక్తి తగ్గడం లేదు. సీక్వెల్స్ మూవీతో టైం పాస్ చేసే అక్షయ్ కుమార్.. ఫ్రాంచైజీ మూవీలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రెష్ స్టోరీ భూత్ బంగ్లాతో ఏప్రిల్ 10 భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. అక్షయ్ ఈ రూట్ ఛూజ్ చేసుకుంటే.. మరో అగ్ర హీరో అజయ్ దేవగన్ చూస్తూ ఊరుకుంటాడా?. అతడ్ని ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం సీక్వెల్స్ చిత్రాలతో బిజీగా ఉన్న అజయ్.. నెక్ట్స్ ఓ ప్రెష్ దెయ్యాల స్టోరీ చేయబోతున్నాడట.

Also Read: Mohanlal New Movies: లాలట్టన్ లైనప్‌ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!

20 ఏళ్ల తర్వాత అజయ్ దేవగన్ ఓ హారర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. భూత్ మూవీ తర్వాత అజయ్ హారర్ జోనర్ జోలికి పోలేదు. సైతాన్‌ చేసినప్పటికీ.. అదీ సైకాలజీకల్ హారర్ థ్రిల్లర్, ప్యూర్ హారర్ జోనర్ కాదు. మళ్లీ ఇన్నాళ్లకు పంజాబీ దర్శకుడు రోహిత్ జుగ్రాజ్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోప్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్.. జులై నుంచి లండన్‌లో షూటింగ్ జరుపుకోనుందట. ఇక ఫ్రెష్ హారర్ స్టోరీస్ సక్సెస్ కొడితే.. వెంటనే సీక్వెల్స్ సిద్దం చేసేస్తారేమో ఈ సీక్వెల్ రాజాలు.

Exit mobile version