NTV Telugu Site icon

Bollywood : హిందీ లో రికార్డు స్థాయిలో దేవర కలెక్షన్స్.. ఎన్నికోట్లో తెలుసా..?

Devara Hindi

Devara Hindi

దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్  అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.

Also Read : Pawan Kalyan : కీరవాణికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ ఓపెనింగ్ తెచ్చుకున్న దేవర హిందీ బెల్ట్ లో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. మొదటి కేవలం రు 7.95 కోట్లు, రెండవ రోజు రూ. 9.50 కోట్లు, ఆదివారం అనగా మూడవ రోజు రూ. 12.07 కోట్లు రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ పేర్కొన్నారు. మొదటి మూడు రోజులకు మొత్తంగా చూసుకుంటే రూ. 29.52 కోట్లు కలెక్ట్ చేసాడు దేవర. ఈ కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు కంటే రెండవ రోజు, రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ రాబట్టగలిగాయి. కాగా రోజు రోజుకు దేవర కలెక్షన్స్ పెరుగుతుండడంతో నార్త్ లో ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర హిందీ వర్షన్ కలెక్షన్స్ మాత్రం అదరగొట్టాయి. మొదటి మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రూ. 44 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ హిందీ వర్షన్ లో భారీ నంబర్స్ కనిపించాయి.

Show comments