యానిమల్‌తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న త్రిప్తి దిమ్రీకి అక్కడి నుండి లక్ దడేల్ దడేల్ అని తన్నుకొస్తుంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దీపికా పదుకొణే అత్యుత్సాహం, యారోగన్సీ వల్ల త్రిప్తి లాభం పొందింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా హై అక్డేన్ మూవీలో తానూ ఊహించకుండానే ఛాన్స్ కొల్లగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం కష్టమే. యానిమల్‌తో జోయాగా పరిచయం అయినప్పటి అదీ బీటౌన్ ఫిల్మ్. సో ఇప్పుడు స్పిరిట్‌తో త్రిప్తి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
Also Read : Janhvi Kapoor : హమ్మయ్య.. జాన్వీ కపూర్ కు ఓ హిట్ పడింది..
ఆజాద్‌తో బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన రాషా తడానీ ఆ సినిమా ప్లాప్ అయినా ఉయ్యమ్మా సాంగ్ ఆమెను పాపులర్ చేసింది. కానీ కూతుర్ని టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేయాలని రవీనా టాండన్ తపన. ప్రయత్నాలు సక్సెస్ అయ్యి బాలకృష్ణ సన్ మోక్షజ్ఞతో మూవీ సెట్ అయ్యింది అనుకుంటున్న టైంలో ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయ్యింది. ఉంటుందో లేదో కూడా చెప్పడం కష్టం. ఇక టీటౌన్ ఎంట్రీపై డౌట్స్ వస్తున్న వేళ ఇప్పుడు మరో ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్. మహేష్ బాబు అన్నయ్య, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు సన్ జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అజయ్ భూపతి దర్శకుడు కాగా వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులోకి రాషా తడాని ఎంట్రీ ఇవ్వబోతుందట. ఆల్మోస్ట్ ఆమె ఫైనల్ అయినట్లు టాక్. అక్టోబర్ లేదా నవంబర్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా పెద్దగా కష్టపడకుండానే టాలీవుడ్ ఆఫర్స్ పట్టేశారు త్రిప్తి, రాషా. ఈ ఏడాది జోయా, రాషా టాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ అయినా కనిపించేది మాత్రం నెక్ట్స్ ఇయరే.
