Site icon NTV Telugu

The Raja Saab : ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటా..

Prabhas, Maruti,zarina Wahab

Prabhas, Maruti,zarina Wahab

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్ని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో ప్రభాస్. చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా ఈ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులో మొదట ‘రాజా సాబ్’ సినిమా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా.. ఇందులో హీరోయిన్స్ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమారి తదితరులు ఆడిపాడుతున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Also Read: Anupama : అనుపమని పక్కన్న పెడుతున్న టాలీవుడ్..

ఇక ప్రభాస్‌తో మారుతి కాంబినేషన్ మీద ప్రారంభంలో కొంత విమర్శలెదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన పోస్టర్, మోషన్ టీజర్ అన్నీ సినిమాపై బజ్ పెంచాయి. ఈ ప్రాజెక్ట్‌తో మారుతి పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ హీరోయిన్.. ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జరీనా వహాబ్. ఈ జరీనా వహాబ్ ‘రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు. కాగా ఈ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి, సెట్‌లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నిజం చెప్పాలి అంటే వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి.. వారిలో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి ఉండాలి’ అంటూ ఆమె మనసులో మాట బయట పెట్టారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Exit mobile version