The Raja Saab : ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్ని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో ప్రభాస్. చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా ఈ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇందులో మొదట ‘రాజా సాబ్’ సినిమా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా.. ఇందులో హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమారి తదితరులు ఆడిపాడుతున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
Also Read: Anupama : అనుపమని పక్కన్న పెడుతున్న టాలీవుడ్..
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ఇక ప్రభాస్‌తో మారుతి కాంబినేషన్ మీద ప్రారంభంలో కొంత విమర్శలెదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన పోస్టర్, మోషన్ టీజర్ అన్నీ సినిమాపై బజ్ పెంచాయి. ఈ ప్రాజెక్ట్‌తో మారుతి పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ హీరోయిన్.. ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జరీనా వహాబ్. ఈ జరీనా వహాబ్ ‘రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు. కాగా ఈ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి, సెట్‌లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నిజం చెప్పాలి అంటే వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి.. వారిలో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి ఉండాలి’ అంటూ ఆమె మనసులో మాట బయట పెట్టారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
- Tags
- Maruti
- prabhas
- Zarina Wahab
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!