NTV Telugu Site icon

Kangana Ranaut: చంద్రముఖిగా కాంట్రవర్సీక్వీన్‌.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అదుర్స్‌

Kangana

Kangana

Kangana Ranaut: బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇప్పుడు నటుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు. చంద్రముఖి దర్శకుడు పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో చంద్రముఖిగా కంగనా కనిపించనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో కాంట్రవర్సీ క్విన్ కంగనా నటించనుందని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కంగనా పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే చంద్రముఖి-2లో లక్ష్మీ మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. హారర్ జోన‌ర్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చంద్రముఖికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి భాగం చంద్రముఖిలో కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు ఈసీక్వెల్‌లో కూడా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సినిమా డిజైనర్ అయిన నీతా లుల్లా కూడా కంగనా లుక్ గురించి మాట్లాడుతూ, “కంగానా ప్రతిరూపమైన పాత్రను సృష్టించడానికి, ఆమె లుక్స్, ఆమె జుట్టు, ఆమె వైఖరి, నడకలో డ్యాన్స్ స్ఫూర్తిని చిత్రీకరిస్తున్నామని. నాకు ఇప్పుడు కంగనా చంద్రముఖి. ఈ చిత్రం ఒక అందమైన, సవాలుతో కూడుకున్న అనుభవంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో కంగనా రనౌత్‌తో మళ్లీ కలిసి పనిచేయడానికి నేను చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే.. బాలీవుడ్‌లో అత్యధిక రేటింగ్ పొందిన నటీమణులలో ఒకరైన కంగనా తమిళ సినిమాకి కొత్త కాదు, ఎందుకంటే ఆమె ఇప్పటికే ‘ధామ్ ధూమ్’లో జయం రవికి జోడీగా నటించింది. ఇటీవల ఆమె దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత బయోపిక్‌లో విజయ్ దర్శకత్వం వహించిన ‘తలైవి’లో తన ప్రామాణికమైన పాత్ర ద్వారా విమర్శకులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరి చంద్రముఖితో ఎంతమందిని కంగనా ఆకట్టుకోనుంది అనే విషయమై 2023 వరకు వేచి చూడాల్సిందే..

 

కంగనా పోస్టర్‌లో క్లాసీ, డిజైనర్ లెహంగా ధరించి, పురాతన ఆభరణాలతో తన రూపాన్ని పెంచుకుంది. మేకర్స్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కంగనాను స్వాగతించారు “#చంద్రముఖి2 ప్రపంచంలోకి #కంగనారనౌత్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని తెలిపారు.