Site icon NTV Telugu

Bollywood : రీమేక్ చేస్తే హిట్.. స్ట్రయిట్ సినిమా చేస్తే డిజాస్టర్.. యంగ్ హీరోకు వింత పరిస్థితి

Bollywood (2)

Bollywood (2)

సౌత్ సినిమాలను టైగర్ ష్రాఫ్ యూజ్ చేసుకున్నట్లుగా మరో యంగ్ హీరో చేసుకోలేదనే  చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండే సౌత్ మూవీస్‌పై ప్రేమ పెంచుకున్నాడు టైగర్. పరుగు రీమేక్ ‘హీరో పంటి’ నుండే అతడి ప్రయాణం స్టార్టైంది. ఈ సినిమా సక్సెస్ కొట్టడం టైగర్ ష్రాఫ్ పేరు గట్టిగానే వినిపించడంతో నెక్ట్స్ కూడా ప్రభాస్, గోపీచంద్ మూవీ వర్షం రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాఘీతో మొదలైన ఈ సక్సెస్ పరంపర బాఘీ3 వరకు కంటిన్యూ అయ్యింది.

Also Read : Tollywood : టాలీవుడ్ ఆడియన్స్ మార్పు కోరుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్స్ ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా…?

రీమేక్స్ కింగ్‌గా ముద్రపడిపోతుందేమోనని భయపడి స్ట్రైట్ మూవీస్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ గా నిలిచాయి. ఎ ఫ్లైయింగ్ జాట్, మున్నా మైఖేల్. వరుస ప్లాపులతో అతడి కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో మళ్లీ బాఘీ సీక్వెల్ టేకప్ చేశాడు. తెలుగు అడివి శేష్ నటించిన క్షణం రీమేక్ బాఘీ2గా చేసి మరో హిట్ వేసుకున్నాడు. బాఘీ3తో తమిళ్ ఫిల్మ్ వెట్టాయ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో మరోసారి సౌత్ సినిమానే నమ్ముకున్నాడు. బడేమియా చోటా మియాతో భారీ డిజాస్టర్ చూసిన టైగర్ ష్రాఫ్ తనను మళ్లీ హిట్ బాట పట్టించేది బాఘీ సిరీస్సేనని భావించి బాఘీ4ని దించాడు. ఈ సారి సౌత్ స్టోరీతో పాటు దర్శకుడ్ని కూడా పట్టుకెళ్లాడు. 2013 తమిళ్ హిట్ మూవీ ట్రిపుల్ 5ని కన్నడ దర్శకుడితో రీమేక్ చేయించాడు నిర్మాత సాజిద్ నడియాద్ వాలా. సినిమా మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకున్నా, వసూళ్లు ఇరగదీస్తోంది. ఇలా తను పడిపోయిన ప్రతిసారీ టైగర్ ష్రాఫ్‌ను ఆదుకుంటూ అతడిని బౌన్స్ బ్యాక్ చేస్తోంది సౌత్ సినిమా.

Exit mobile version