Site icon NTV Telugu

Bolisetti Srinivas: అల్లు అర్జున్ కు, మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు!

Allu Arjun Bolisetty Srinu

Allu Arjun Bolisetty Srinu

Bolisetti Srinivas Final clarity on Allu Arjun Issue: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికే ఒక ట్వీట్ డిలీట్ చేసిన ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ కి, మాకు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలచుకోలేదు. నిన్న నన్ను అడిగారు దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది. అతనికి నాకు కానీ మా పార్టీకి అల్లు అర్జున్ కి గాని శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఊరికే మనం మాట్లాడటం భావ్యం కాదు. మొన్న ఆయన మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాను, అది అక్కడితో అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మీరు అడగండి అప్పుడు నేను కౌంటర్ ఇస్తాను అంటూ ఆయన కామెంట్ చేశారు.

Siddique : నటుడిపై నటి రేప్ కేసు.. తెలుగులోనూ?

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .సుకుమార్ భార్య ఆహ్వానించడంతోనే వచ్చానని ఇష్టమైన వారి కోసం ఎంత దూరమైనా వస్తా అంటూ అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. అయితే అది పరోక్షంగా ఎన్నికల సమయంలో శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం గురించి కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో అల్లు అర్జున్ అభిమానుల సైతం మెగా అభిమానుల మీద ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే విషయం మీద నిన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అతను తన తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేకపోయాడు, అయినా అసలు అతనిని పిలవలేదు అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేశారు.

Exit mobile version