Site icon NTV Telugu

Devara: దేవర ముంగిట మరో ‘యానిమల్’

Devara First Single

Devara First Single

Bobby Deol joins the cast of Jr NTR’s Devara Part 1 as villain : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి కొరటాల శివతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ని సిద్ధం చేశారు. హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే చాలామంది టాలెంటెడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. అదేంటంటే మరో విలన్నీ కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బాబీ డియోల్ ని ఈ సినిమాలో విలన్ గా దింపుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బాబీ డియోల్ ఇప్పటికే పలు తెలుగు ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. హరిహర వీరమల్ల సినిమాతో పాటు బాలకృష్ణ బాబీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయన్ని సెకండ్ పార్ట్ కి మెయిన్ విలన్ గా తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

Exit mobile version