NTV Telugu Site icon

Biggest Multistarrer : మహేశ్.. రజనీకాంత్.. రామ్ పోతినేని.. ఫిక్స్ ?

Untitled Design (7)

Untitled Design (7)

 

టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు.

Also Read : TJ Gnanavel : ‘మసాలా & మర్డర్స్’గా రానున్న తమిళనాడు ‘కింగ్’ బయోపిక్..

తాజగా టాలీవుడ్ లో మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ పోతినేని హీరోగా మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ నటుడిని సంప్రదించగా అక్కడ కుదరకపోవడంతో తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ను అప్రోచ్ అయి కథ వినిపించారని తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే టాలీవుడ్ లో బిగెస్ట్ మల్టీస్టారర్ రానున్నట్టే. జైలర్ హిట్ తో జోష్ మీదున్నాడు రజనీ. హీరోయిన్ గా సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నవీన్ పోలిశెట్టి  అనుష్క జంటగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మహేశ్ పి. తన రెండో సినిమాగా రామ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.