Site icon NTV Telugu

Bigg Boss 9 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆమె అవుట్!

Bigg Boss 9

Bigg Boss 9

బిగ్ బాస్ తెలుగు 9 ఐదవ వారంలోకి అడుగుపెట్టి, రోజురోజుకు నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో సామాన్యులను చేర్చడం, ‘ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్’ ఫార్మాట్ వంటి కొత్త అంశాలు షోలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వడం షోలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా, రికార్డు స్థాయిలో 10 మంది పోటీదారులు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. నామినేట్ అయిన వారిలో రీతు చౌదరి, డెమన్ పవన్, ఫ్లోరా సైని, భరణి శంకర్, సుమన్ శెట్టి, తనూజ గౌడ, సంజన గల్రాని, శ్రీజ దమ్ము, దివ్య నిఖిత మరియు కళ్యాణ్ పడాల ఉన్నారు.

Also Read :Raashi Khanna : ఈ సినిమా చేస్తున్నపుడు చాలా ట్రిగ్గర్ అయ్యా

వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టిన దివ్య నిఖిత కూడా నామినేషన్లలో ఉండటం గమనార్హం. ఒకేసారి ఇంతమంది ఎలిమినేషన్‌కు నామినేట్ కావడం ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల ముందు సామాన్యుల పోరాటం
‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన ఆరుగురు సామాన్యులు సెలబ్రిటీలకు గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ, ఆటలో నిలదొక్కుకోవడం వారికి సవాలుగా మారింది. ఇప్పటికే షో నుండి ఎలిమినేట్ అయిన నలుగురు కంటెస్టెంట్లలో శ్రష్టి వర్మ మినహాయించి మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మరియు హరిత హరీష్ కామనర్స్ కావడం గమనార్హం. ఇప్పుడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడంతో, ఈ వారం ఎవరు బయటకు వెళ్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా, నామినేట్ అయిన వారిలో ఒకరైన ఫ్లోరా సైని ఎలిమినేట్ అవ్వడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక రెండో కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Exit mobile version