NTV Telugu Site icon

PURI : ఎట్టకేలకు పూరి జగన్నాథ్ కు ఓ హీరో దొరికేసాడు

Puri

Puri

పూరి జగన్నాథ్‌తో ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఫలానా హీరోల చుట్టు తిరుగుతునే ఉన్నాడు కానీ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడం లేదని అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గోపీచంద్‌తో గోలీమార్ సీక్వెల్‌ ఫిక్స్ అయింది, నాగార్జునతో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ అయిందనే టాక్ వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు పూరి. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్ అయినట్టుగా తెలిసింది.

Also Read : V.C. Sajjanar : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి బెండు తీస్తున్న సజ్జనార్

ఇప్పటి వరకు కెరీర్ లో విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నపాత్రలు చేశాడు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ పూరితో సినిమా అనేసరికి చాలా ఎగ్జైటింగ్‌గా మారింది. పూరి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి స్టైల్ ఆఫ్ ఎలివేషన్ వేరే లెవల్లో ఉంటుంది. అలాంటి పూరి విజయ్ సేతుపతితో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది మరింత ఆసక్తికరంగా మారింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఫ్లాప్స్ చూసిన పూరికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. లేదంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీనుండి తప్పుకునే పరిస్థితి వస్తుందని క్రిటిక్స్ అభిప్రాయం.